April 30, 2024

మాలిక పదచంద్రిక మార్చ్ 2015

కూర్పరి: శ్రావ్య వరాలి కొవ్వలి

ఆఖరు తేదీ: మార్చి 20 , 2015

చిరునామా: editor@maalika.org

march padachandrika15

 

అడ్డం
1    రచయిత్రి, మానవసేవిక.  ఇన్ఫోసిస్ మూర్తికీవిడ మేలైన అర్ధభాగం  కూడా
2    రెండుసార్లు నోబెల్ బహుమానం సంపాదించుకున్న అసాధారణ ప్రతిభాశాలి  -ఈ మహిళ.
7    వింటి తాడులాంటి స్త్రీ
8    రేడియోనాటకాలలో ఈవిడది ప్రత్యేక స్థానం.. గణపతి తల్లిగా సుప్రసిధ్దురాలీ నండూరి నారీమణి.
9    వాలిసుగ్రీవుల మధ్యనలిగిపోయిన నక్షత్రం
11    విష్ణువాహనపు జనని
14    ఆడువారి మెడలో ఈ అందమైన పేరు వేసి, చూడండి వారి మోములో ఆనందం.
15    విశ్వనాధ వారి అందమైన సాని
18    అలనాటి మేటి తెలుగు నటి.. ఢిల్లీ లోనదికి నామాంతరం
20    అమ్మాయిలు చలికి వెరచి ముగ్గులు వేయకపోతే ఈపండగవ్వదు.
22    ఈయన లేకపోతే మరదలికి సరదా లేదు.
23    ద్రౌపది. నల్లగా ఉంటుందనా ఈపేరు?
24    శ్వేతకోయిల బిరుదున్న గాయని. రావణుడిని శపించిన సాధ్వి .. పూర్వజన్మలో సీత
26    దేవి కొలువుండే నవావర్ణ ఐలాండు
28    సంగీతకళానిధి, ఈవిడ సుప్రభాతం వినకుండా శ్రీనివాసుడు నిద్రలేవడేమో… 3421
30    స్త్రీవేషధారణలో ప్రధమ స్థానం ఈయనదే.  పొడి అక్షరాలలో
31    అందగత్తె … నీవంటి దివ్య స్వరూపిణి ఎందెందు వెదకిన లేదు కదా

నిలువు
1    అంతరిక్షంలో ఎక్కువరోజులు గడిపిన వ్యోమగామిని
2    ఐదుసార్లు ప్రపంచ బాక్సింగు ఛాంపియన్  .. ప్రియాంకా చోప్రా
4    అలనాటి నటి, పాకిస్తాన్ క్రికెటర్ మొహిసిన్ ఖాన్ ఒకప్పటి పెళ్ళాం
5    సత్యభామ. ఈ అసురుడిని సంహరించింది కాబట్టి ఇలా పిలవచ్చేమో.
6    ఒక కమ్మని మాట.  మాక్జిం గోర్కీ నడగండి.
10    జయజయజయ శత సహస్ర .. 7 అడ్డానికి ముందు పెట్టి తిరగేస్తే..  హృదయనేత్రి
12    ఆనాటి నటి .. కాజోల్ ఈవిడ తనువు నుండి జనించినదే
13    గున్నమామిడి కొమ్మలోన గూళ్ళ లోంచి పాడి పాడి ఈవిడ కొద్దిగా తడబడింది
16    ఆవిడే శ్యామల.. భలే రమ్యంగా ఉందే
17    రమణీ ప్రియ — తెచ్చి ఇచ్చే కిళ్ళీ కావాలిట అల్లసాని వారికి కవిత్వం రావాలంటే
19    పేరంటాలకి పోయె అర్హతగల స్త్రీ
21    మొదలు లేకపోయినా బిడ్డని కనేప్పుడు వేదన తప్పదు
25    నుదుట పెట్టుకునేది
26    ఈవిడతో పెట్టుకునేరు సుమా జాగ్రత్త.  ఈమె పేరొందిన టీవీ ఏంకరు. కాస్త తలకిందుల మనిషి
27    ఈమధ్యనే పోయిన ఒక ఆడ కార్టూనిష్టు పేరులో సగం.  ఆవిడ రాగాలు తీసే ఆవిడ కాదు.
29    తబుస్సం ఖాన్ కి పొట్టి పేరు- తలకిందులవాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *