రాహుగ్రహ దోషానికి రాహుకాల దీపాలు…….,,,

మంగళవారం పూట దుర్గమ్మ తల్లికి నేతితో దీపమెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. మంగళవారం రాహుకాలంలో దుర్గమ్మ తల్లికి దీపమెలిగించే మహిళలు నిష్ఠతో అమ్మవారిని దుర్గాష్టకంతో స్తుతిస్తే ఈతిబాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయి.

ఇంకా మంగళవారం ఉదయం సూర్యోదయానికి ముందే లేచి శుచిగా తలస్నానమాచరించి.. ఇంటిని, పూజామందిరమును శుభ్రం చేసుకుని పువ్వులు, ముగ్గులతో అలంకరించుకోవాలి. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 4.30 వరకు ఆలయాల్లో జరిగే రాహుకాల పూజను ముగించుకోవాలి.

అనంతరం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో గృహంలో దీపమెలిగించి.. పాయసం నైవేద్యంగా సమర్పించుకోవాలి. దీపమెలిగించే సమయంలో దుర్గా సప్తశ్లోకి స్తోత్రాన్ని 9 తొమ్మిదిసార్లు పఠిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు.

రాహు కాలదీపాలు వెలిగించటంవలన రాహుగ్రహ దోషాలైన చెడు వ్యసనాలు,భ్రమలు,అత్యాశ నివారించబడతాయి.

మనసిక ఆందోళనలు నివారించబడతాయి.

మోసగించే వారినుండి రక్షింపడతారు.

వాస్తవానికి దూరంగా ఉంటూ లేనిది ఉన్నట్టు ఊహించుకొనే వాళ్ళకు ఈ రాహుకాల దీపాలు తప్పనిసరిగా పెట్టాలి.

జాతకంలో చంద్ర రాహులు కలిసి వున్నవారు తప్పనిసరిగా రాహుకాలదీపాలు పెట్టాలి.

నైఋతి దిక్కుకి ప్రతినిద్యం వహించే రాహువు గృహం లో గాని,మరేయితర వ్యాపార సముదాయాలలోగాని నైఋతి దిక్కు దోషం వున్న వారు తప్పనిసరిగా రాహుకాల దీపాలు పెట్టాలి.

గురుగ్రహా దోష నివారణ స్తోత్రం