అందుకే సుందరకాండ వింటే పాప దహనమైపోతుంది.

ఇక్కడ అక్కడ అని లేకుండా ప్రపంచమంతా బ్రహ్మముతో నిండిపోయి ఉన్నది అని వేదము మనకి చెపుతోంది. ఫలానాచోటనే బ్రహ్మము ఉంటాడని పరుగెత్తడం మొట్టమొదటి భక్తి స్థాయి. కాని అలా పరుగెత్తుతుంటే మీకు ఎప్పటికి బ్రహ్మదర్శనం అవుతుంది? నిజంగా బ్రహ్మదర్శనము చెయ్యాలని అనుకున్నవాడు, నీవు నిశ్శబ్దంగా కూర్చుండిపోయి ఏ అరమరిక లేకుండా ఎవరితో సంబంధం పెట్టుకోకుండా భగవత్ ప్రార్థన చెయ్యడం మొదలు పెట్టాలి. ” అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ” బయట వెతికితే దొరుకుతుందా? ఎవరు లోపలికి వెడుతున్నారో, అందరిలా బయట ప్రపంచముతో తాదాత్మ్యము చెందడంలేదో అటువంటి మహాపురుషుని స్థితిని హనుమ ఈ రోజు పొంది ఉన్నాడు. అటువంటి స్వామి దర్శనము చేసినంత మాత్రంచేత, అటువంటి సాధకుడిగురించిన మాట విన్నంత మాత్రం చేత మన పాపములుకూడా ఎగిరిపోతాయి. అందుకనే ” వ” బీజాక్షరమును అక్కడ ప్రయోగం చేశారు. అందుకే సుందరకాండ వింటే పాప దహనమైపోతుంది.

1010229_728883020494432_6608997960394759296_n
ఈ వేళ హనుమ సీతామాత దర్శనం చెయ్యాలి అని సంకల్పించాడు. అందుకని తాను వెడతానన్నాడు. మిగిలినవాళ్ళు అనలేదు. కాబట్టి వాళ్ళు వెనుక ఉండిపోయారు. హనుమ ముందుకు కొనసాగగలిగాడు. తన సంకల్పంవలన ఆయన చరితార్ధుడయ్యాడు.

Make any Suggitions